పాడి పరిశ్రమ అభివృద్ధికి చేయూత రుణాలు

మహిళలను పాడి పరిశ్రమ ద్వారా అభివృద్ధి చేసేందుకు వైయస్సార్ క్రాంతి పదం ద్వారా ప్రత్యేక రుణాలు అందజేయడం జరుగుతుందని పశువైద్యాధికారిని ఎం విజయలక్ష్మి అన్నారు. స్థానిక వైఎస్ఆర్ క్రాంతి పదం కార్యాలయంలో గురువారం వివో ఏ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో వైయస్సార్ క్రాంతి పదం ద్వారా అర్హత గల వారిని గుర్తించి గేదలు మేకలు గొర్రెలు కొనుగోలుకు అవసరమైన మేర బ్యాంకు రుణాలు మంజూరు చేయాలన్నారు. మహిళలు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆదాయభివృద్ధిని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైకెపి ఎపిఎం టి హనుమంతరావు. సీసీ మోహనరావు. గురవయ్య. అకౌంటెంట్ మార్తమ్మ. సంఘాల్లోని మహిళలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *