( గ్రామాల్లో జగనన్న కాలనీల ద్వారా గృహ నిర్మాణాలు మొదలుపెట్టిన లబ్ధిదారులు త్వరగా పూర్తి చేయాలని దర్శి హౌసింగ్ డిఇ నిరీక్షణ రావు అన్నారు. మండలంలోని సింగనపాలెం గ్రామంలో నీ సచివాలయంలో గురువారం గృహాల లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి స్థాయిని బట్టి ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులను గుర్తించి వారికి అవగాహన కల్పించాలన్నారు. ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరూ సకాలంలో పూర్తి చేసుకొని బిల్లులు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ హనుమంతరావు సచివాలయ సిబ్బంది. మహిళలు పాల్గొన్నారు
