ఎస్సీ ఎస్టీ స్వయం సహాయక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉన్నతి పథకం ద్వారా మార్కెట్ సదుపాయాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకొనుట ద్వారా స్వయం సహాయ సంఘాలు ఆర్థిక అభివృద్ధి పెంపొందించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి అని ముండ్లమూరు మండల పశువైద్యాధికారి విజయలక్ష్మి తెలియజేశారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ముండ్లమూరు మండలం కమ్యూనిటీ మొబైల్ లైజర్ గోపన బోయిన వెంకట్రావు అధ్యక్షతన మండల వైయస్సార్ క్రాంతి పదం సమావేశం హాలో నందు మండల స్థాయిలోని దళిత,ఆదివాసి మహిళలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమం వైఎస్ఆర్ క్రాంతి పథం మండల ఏపీఎం టి .హనుమంతరావు మాట్లాడుతూ మండలస్థాయి లొఎస్సీ,ఎస్టీ స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా స్వయం సహాయక సంఘాలను అభివృద్ధి పరచుటకు ఉన్నతి ,ఆసరా చేయూత, జగనన్న తోడు,వంటిపథకాలు ద్వారా ఆహార ఉత్పత్తులు తయారు చేసుకునే లఘు పరిశ్రమల ద్వారా ఆర్థికంగా స్థిరపడే వరకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నందున ఆ దిశగా ఎస్సీ,ఎస్టీ స్వయం సహాయక సంఘాలొని మహిళలు ఆర్థిక అభివృద్ధి వైపు పయనించాల మహిళలు దారిద్ర రేఖకు దిగువనున్న వారు ఆర్దికంగా స్థిర పడుటకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఎక్కువ అవకాశం ఉన్నందున మహిళలు గ్రామస్థాయిలో ప్రతిఒక్కరూ స్వయం సహాయక సంఘాల్లో చేరాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ క్రాంతి పథం క్లస్టర్ కో-ఆర్డినేటర్స్ గురవయ్య, మోహన్ రావు, మార్తమ్మ వివిధ గ్రామాల నుండి వచ్చిన దళిత ఆదివాసి మహిళలు పాల్గొన్నారు .
ఎస్సీ ,ఎస్టీ స్వయం సహాయక సంఘాలు ఆర్థిక అభివృద్ధి వైపు పయనించాలి- మండల పశు వైద్యాధికారి విజయలక్ష్మి
12
Jan