గ్రామాల్లో ఉన్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే గడప గడపకు మన ప్రభుత్వం లక్ష్యమని దర్శి శాసన సభ్యుడు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన మండలంలోని ఆవులమంద, కొత్తూరు, ప్రతిజ్ఞాపురి కాలనీల్లో ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథ కాలు అందుతున్నాయా, సిబ్బంది పనితీరుపై ప్రజలను ఆరా తీశారు. ప్రతిజ్ఞాపురి కాలనీకి వెళ్లే రోడ్డు నిర్మించాలని కాలనీ వాసులు కోరారు. ఆవు లమంద కొత్తూరులో నీటి సమస్య ఉందని, ఆవు లమందలో అదనపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అవ సరమని తెలిపారు. అంతర్గత రోడ్లు నిర్మాణం, డ్రైనేజీ సమస్యలు, నాంచారపురంలో విద్యుత్ లైన్లు తెగిపోతున్నాయని, కిందకు ఉన్నాయని ప్రజలు ఎమ్మెల్యేకు తెలిపారు. విద్యుత్ ఏడీఈ పిచ్చయ్యతో మాట్లాడి ఈ నెలాఖరులోపు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయాలని, నాంచారపు రంలో విద్యుత్ తీగలు పైకి కట్టాలని, మరమ్మ తులు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి ఆదేశించారు. అన్ని వర్గాల ప్రజలకు సహకారం అందిస్తూ… వారి అభివృద్ధికి తోడ్పడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆదరించాలన్నారు. రాష్ట్ర ఫిషరీస్ అడ్వైజర్ షేక్ సైదా, దర్శి ఏఎంసీ ఛైర్మన్ వైవీ సుబ్బయ్య, వైస్ ఛైర్మన్ కేసనపల్లి నాగేశ్వరరావు, పెద్దవరం, కల్లూరు సర్పంచ్లు మారెళ్ల కాశీ చెన్నకేశవులు, నక్కా రామకృష్ణ, నాయకులు మేరువ పిచ్చిరెడ్డి, మేరువ సుబ్బారెడ్డి, గొట్టిపాటి బాలకోటయ్య, చిన్నపెద్దయ్య, గొట్టిపాటి బొల్లి కొండయ్య, వైవీ సుబ్బయ్య, బెల్లం చంద్రశేఖర్, తెల్లమేకల వెంకటేశ్వర్లు, గొట్టిపాటి రంగారావు, గొట్టిపాటి రాములు, గొట్టిపాటి వెంకటేశ్వర్లు,రోశయ్య పాల్గొన్నారు.
