ప్రతి సమస్యకు పరిష్కారం
ప్రజాసమస్యల పరిష్కారం కోసమే ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేప ట్టారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి మండలంలోని త్రిపురసుందరీపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురు వారం రాత్రి జరిగింది. దర్శి ఎమ్మెల్యే ప్రజాస మస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో గ్రామాల్లో ప్రజాసమస్యలు తెలుసుకోగలుగుతు న్నామని చెప్పారు. త్రిపురసుందరీపురంలో ఎక్కు వగా వీధి కాలువలు, విద్యుత్ సమస్యలున్నాయని, వాటన్నింటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో మళ్లీ 2024లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఓట్లు వేసి గెలిపిస్తామని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామాన్ని సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్మో హనరెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మండల పార్టీ కన్నీరు వెన్నపూస వెంకటరెడ్డి, ఏఎంసీ చైర్మన్ వైవీ సుబ్బయ్య, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, సర్పంచ్ అమల, ఎంపీడీఓ కుసుమకుమారి, సర్పంచ్లు రామారావు, సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



