క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దారుఢ్యానికి ఎంతో ఉపయోగపడతాయని దర్శి వైసీపీ నాయకులు మద్ది శెట్టి శ్రీధర్ అన్నారు. మండలంలోని వేముల గ్రామంలో గల సచివాలయ ప్రాంగణంలో శుక్రవారం ఆ గ్రామ సర్పంచి గజ్జెల ఆదెమ్మ అధ్యక్షతన జరిగింది. ఉమ్మడి ప్రకాశం గుంటూరు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పోటీలు సమాజా ఐక్యతను దోహదపడతాయన్నారు. సంక్రాంతి పండుగ రోజుల్లో ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయ మన్నారు. ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఆటల ద్వారా యువతలో ఐక్యత పెంపొందుతుందని పరిచయాలు పెరుగుతాయని అన్నారు. జడ్పిటిసి తాతపూడి మోజేష్ రత్నం రాజు మాట్లాడుతూ పోటీల లో పాల్గొనే యువత కేవలం ఉల్లాసంగా ఆడుకోవా లే గా నీ విద్వేషాలకు పోవద్దని తెలిపారు. ముందుగా కబడ్డీ పోటీ లకు టాస్ వేసి కబడ్డీ పోటీలు ప్రారంభించారు. కబడ్డీ క్రీడాకారు ల తో పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఓగులూరీరామాంజి. జమ్మల గురవయ్య. జనమాల నాగేంద్ర పిచ్చయ్య. చొప్పరపు వెంకటేశ్వర్లు. పసుపుగల్లు సొసైటీ అధ్యక్షులు కుమ్మెత వెంకట్ రెడ్డి. సొసైటీ డైరెక్టర్ జిల్లెలమూడి శివయ్య. వైసీపీ మండల యువ నాయకులు బిజ్జం వెంకట సుబ్బారెడ్డి. గోపన బోయిన పిలుపు రాజు. వైసిపి మండల మహిళా నాయకురాలు మేడికొండ జయంతి. వైసిపి మండల యువ నాయకులు బైల డుగు కృష్ణ యాదవ్ .నిడమానూరి చెంచయ్య. పాలపర్తి గురవయ్య. దుగ్గినేని వెంకట్. దాసరి ఏలియా. గోపన బోయిన అంకాలు. గోపన బోయిన ఆంటోని తదితరులు పాల్గొన్నారు.


