ముండ్లమూరు మండలంలోని నాయుడుపాలెం గ్రామంలో గల డాక్టర్ వైయస్సార్ క్లినిక్ నందు శుక్రవారం ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించి నట్లు మారెళ్ళ వైద్యాధికారి సిహెచ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నీ పేద ప్రజలకు ఖరీదైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం104 వాహనం ద్వారా ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య శిబిరాలు నిర్వహించి ప్రైవేటు హాస్పిటల్స్ దీటుగా ప్రభుత్వ హాస్పటల్లో 67 రకాల మందులు12రకాల టెస్టులతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఈ వైద్య శిబిరానికి వచ్చి వైద్య సేవలు పొందాలని ఆయన తెలిపారు. ఈ శిబిరంలో. షుగరు .బీపీ. గర్భవతులు. బాలింతలు. జలుబు. దగ్గు జ్వరాలకు. పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని. వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
