రక్తహీనత పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మారెళ్ళ వైద్యాధికారి బి మధు శంకర్ అన్నారు. మండలంలోని మారళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల లోపు వయసు గల విద్యార్థులకు కౌమారదసపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. రక్తహీనత రాకుండా చూసుకోవాలన్నారు. సమయానికి సరైన ఆహారనియమాలు పాటించాలన్నారు. పెద్దలు బీపీ షుగర్ పట్ల పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఏదన్నా అనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చి వైద్య సేవలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ వెంకటరావు. హెల్త్ సూపర్వైజర్ నాగేశ్వరరావు. హెచ్ వి ఎస్.కె హుస్సేన్ బి. సిబ్బంది పాల్గొన్నారు.
రక్తహీనత పై అవగాహన కలిగి ఉండాలి
13
Jan