ఉద్యాన వన పంటలలో చిరుధాన్యాలు అంతర పంటగా సాగు చేయటం వలన ఉద్యాన వన పంటలకు, చిరు ధాన్యాల పంటలకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. నాగంబొట్లపాలెంలో ఉద్యాన వన పంటలైన జామ, సీతాఫలంలలో సాగు చేసిన చిరుధాన్యం పంటలను వ్యవసాయాధికారి శుక్రవారం పరిశీలించారు. చిరుధాన్యాల సాగు వలన నీటి ఎద్దడి ఎర్పడ కుండా నెమ్ము ఉంటుందని, అదే విధంగా ఉద్యాన వన పంటలు చిరుధాన్యాలకు మల్చింగ్ గా ఏర్పడి కలుపు ఏర్పడదని చెప్పారు. నేలపై పొరల్లోని
విలువైన పోషకాలు సేంద్రీయ కర్బనం, సూక్ష్మ పోషకాలు సూర్మరశ్మికి ఆవిరై పోకుండా గాలికి, నీటి వేగానికి కొట్టుకు పోకుండా ఉంటుందని చెప్పారు. విఏఏ
శ్రీను, రైతులు క్షేత్ర పరిశీలనలో పాల్గొన్నారు.
చిరుధాన్యాలు అంతర పంటగా సాగు చేసుకోవాలి సాగుతో పైర్లకు బహుళ ప్రయోజనాలు
13
Jan