అధికారులు తమ దృష్టికి వచ్చిన సమస్యలపై తక్షణం స్పందించి సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆదేశించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతూ డ్యామెజికి గురయిన స్తంభాలను తక్షణం మార్చాలని, దొంగతనాలను గురైన ట్రాన్స్ఫార్మర్స్ స్థానంలో కొత్తవి మంజూరు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. లో ఓల్టేజి సమస్య లేకుండా చూడాలని కోరారు. ఇంటింటికి కొళాయిలకు సంబంధించి టెండర్లను త్వరగా పిలిచి పనులు పూర్తి చెయ్యాలని కోరారు. విద్యుత్ ఈఈ అబ్ధుల్ కరీం , డీఈ పిచ్చియ్య, ఎఈలు, ఆర్ డబ్ల్యుఎస్ ఇంజనీరింగ్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
