జగనన్న సచివాలయ మండల కన్వీనర్లు చిత్త శుద్ధితో పనిచేసి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేరువ చెయ్యాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం నూతనంగా మండల జగనన్న సచివాలయ కన్వినర్లను ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రకటించారు. దర్శి టౌన్ కన్వినర్ గా ఎదురు కోటి రెడ్డి, దర్శి మండల కన్వినర్ గా బత్తిన వెంకటేశ్వర్లు, ముండ్లమూరు మండల కన్వినర్ మేడికొండ జయంతి, తాళ్లూరు మండల కన్వినర్ గా యాడిక శ్రీనివాస రెడ్డి, కురిచేడు మండల కన్వినర్ యం. సుబ్బారెడ్డి, దొనకొండ మండల కన్వినర్ గా గుంటు పోలయ్యలను ఎమ్మెల్యే ప్రకటించారు. సంబంధిత బాధ్యులు సక్రమంగా పనిచేసి ఆయా మండలాలలో పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియచేస్తూ, సేవలను అందిస్తూ పార్టీ అభ్యున్నతికి కృషి చెయ్యాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కోరారు. వైఎస్సార్సీపీ దర్శి మండల ఇన్చార్జి మద్దిశెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
జగనన్న సచివాలయ మండల కన్వినర్ల నియామకం – చిత్తశుద్దితో పనిచేసి ప్రజలకు సేవలుఅందించాలి- ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్
13
Jan