పొట్లూరి శ్రీనివాసరావు సేవాగుణం ఇతరులకు ఆదర్శనీయమని రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు వేముల బండ శ్రీ షిరిడి సాయి గానగా మందిర్ ట్రస్ట్ చైర్మన్ గుమ్మడిల్లి వెంకటరావు అన్నారు. మండలంలోని జమ్మలమడక ఎస్టీ కాలనీలో పేద మహిళలకు శనివారం సందర్భంగా 50 మందికి 70 వేల రూపాయలు విలువగల పట్టు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుమ్మడిల్లి వెంకటరావు మాట్లాడుతూ పొట్లూరి శ్రీనివాసరావు పేద కుటుంబం నుండి వచ్చి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడి తాళ్లూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ తోటి పేద మహిళలకు నిరంతరం సేవ చేస్తూ తన సేవా నిరతిని చాటుకుంటున్నారని ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. జమ్మలమడక పంచాయతీ పరిధిలో గల ఎస్టి కాలనీవాసులు 50 మందిని గుర్తించి వారికి సంక్రాంతి పండుగ సందర్భంగా నాణ్యతలతో కూడిన 70 వేలు విలువ గల పట్టు చీరలను పంపిణీ చేయడం ఆయన ఔదార్యానికి నిదర్శనం అన్నారు. తనకు ఉన్న దానిలో పేద నిరుపేదలకు గుర్తించి నిరంతరం ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ వారి అభివృద్ధికి పాటు పాడుతున్నారన్నారు. అనంతరం చిన్నారులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొట్లూరి శ్రీనివాసరావును కాలనీవాసులు అభినందనలు తెలిపారు.

