బోగి పండుగను పురస్కరించుకుని వేడుకలు శనివారం ఘనంగా
నిర్వహించుకున్నారు. శనివారం సంక్రాంతి జరుపు కోనున్నారు. గ్రామాలలో ఇళ్ల ముంగిట గొబ్బెమ్మలు, రంగవల్లులు, డూడూ బసవన్నల హడావుడితో అడపడుచుల సంప్రదాయాలతో కళ కళ లాడాయి. ఇళ్ల ముంగింట గొబ్బెమ్మలు, రంగ వళ్లులలతో హడావిడితో ఆడ పడచుల సంప్రదాయాలతో కళ కళ లాడాయి. సంస్కృతులు సంప్రదాయాలకు అద్దం పట్టె పల్లెల్లో పంటలలో కళ కళ లాడు వేళ మరలా సంక్రాంతి పండుగ వచ్చింది. పండుగ నెల ప్రారంభం నుండి మహిళలు, చిన్న పిల్లలు పోటీలు పడుతూ వాకిళ్ల ముందు ముగ్గులు వేసి సంక్రాంతికి స్వాగతం పలికారు. పలు గ్రామాల్లో ముందస్తు సంక్రాంతి పోటీలతో పండుగకు కళ తెచ్చింది. ఆయా గ్రామాలలో పండుగలను బిడ్డలు రావటంతో గ్రామాలలో యువతతో కళ కళ లాడుతున్నాయి. బంధువుల సైతం రాక పోకలతో పల్లెలు సందడితో కళ కళ లాడాయి.
