చీమకుర్తి, సంతనూతలపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రజలు శనివారం తెల్లవారు జామున ఉత్సాహంగా భోగిమంటలు వేసి ఆనందంగా పం డుగ జరుపుకున్నారు. సంక్రాంతి పండుగలో మొదటి రోజు పండుగ భోగి మం టలు వేసి కుటుంబ సభ్యులతో గడిపారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెం కాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి చీమకుర్తిలోని వారి నివాసం వద్ద శనివారం తెల్లవారుజామునే భోగి మంటలు వేసి కుటుంబ సభ్యులతో సం తోషంగా గడిపారు.
పురపాలక సంఘంలోని గాంధీనగర్, కుమ్మరిపాలెంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు జడ్పీ ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతులమీదుగా బహుమతులు అందజేశారు.




