సీఎం క్యాంపు కార్యాలయం లో శనివారం సంక్రాంతి సంబరాలు నేత్రపర్వం గా జరిగాయి. సంప్రదాయ పంచెకట్టుతో సతీ సమేతంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా సీఎం మాట్లాడుతూ.. సంక్రాంతి సంద రాష్ట్ర ప్రజలు అంతా మంచి జరగాల ని, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలంటూ. ఈ కార్యక్రమానికి వచ్చిన, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాత అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి చిహ్నా నికి గుర్తుగా తెల్లని పావురాలను ఎగురవేశారు.
*గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా…..*
అంతకుముందు.. సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాలను చక్కగా పల్లెటూరు. వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు, పాఠశాలల నాడు – నేడు
వంటి ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేస్తూ రంగవల్లులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, ధాన్యాగారాలు, గడ్డివాములు, ఎడ్లబండ్లు ఇలా అసలుసిసలైన పల్లె వాతావరణం ప్రతిబింబిం చాలా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో గ్రామ స్వరాజ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.
*ఉల్లాసంగా ఉత్సాహంగా..*
ఇక ఈ కార్యక్రమానికి సంప్రదాయ దుస్తులతో హాజరైన సీఎం దంపతులను వేదపండితులు నుదుట తిలకం దిద్ది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారిరువురూ జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలనులాంఛనంగా ప్రారంభించారు. గోశాలలోని గోవు లకు పూజచేసి దండలు వేసి వాటిని నిమురుతూ కొద్దిసేపు సంతోషంగా అక్కడ గడిపిన అనంతరం తులసి మొక్కకు నీళ్లుపోసి నమస్కరించుకున్నారు. అక్కడి వినాయకుడి గుడిలోనూ పూజలు నిర్వహిం చారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన భోగిమంటను కాగడాతో వెలిగించారు. హరిదాసుకు బియ్యం పోయడంతోపాటు పండ్లు కూరగాయ లతో కూడిన స్వయంపాకాన్ని సమర్పించారు. గ్రామీణ సంక్రాంతి వేడుకల్లో ప్రధానంగా కనిపించే వివిధ కళాకారులను సీఎం ఆప్యాయంగా పలకరిం చారు. అంతేకాక.. తెలుగింటి సంక్రాంతి పిండివం టలను ముఖ్యమంత్రి దంపతులు రుచి చూశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పర్ణశాలలో సీఎందంపతులు ఆశీనులయ్యారు.
*అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు*
ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుడు ఆనంద్ నేతృ త్వంలో ఏర్పాటుచేసిన ‘శ్రీనివాస కల్యాణం’ నృత్య రూపకాన్ని సీఎం వైఎస్ జగన్ దంపతులు ఆద్యం తం ఆస్వాదించారు. నవరత్నాలతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతుభరోసా స్కృతిక కేంద్రాలు తదితర సేవల ద్వారా గ్రామ స్వరా జ్యాన్ని సాక్షాత్కారం చేసిన తీరును కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమ్మా ఉయ్యాల కోన జంపాల.. పాట పాడిన గాయని ప్రకృతిరెడ్డి, అదే సినిమాలో ఎత్తర జెండా.. పాట పాడిన హారిక నారాయణ్, ప్రముఖ జానపద గాయని కనకవ్వ తదితర కళాకారులు తమ ప్రతి భను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎక్కడో తెలంగాణ మారుమూల గ్రామంలో ఉన్న నన్ను గుర్తించి పిలిపించిన సీఎం వైఎస్ జగన్ దీర్ఘకాలం సీఎంగా ఉండాలంటూ కనకవ్వ ఆశీర్వదించారు. అనంతరం.. శాంతి చిహ్నానికి ప్రతీకగా సీఎం దంప తులు తెల్ల పావురాలను ఎగురవేశారు. ఈ సంబరాల్లో పాల్గొన్న వివిధ కళాకారులను ముఖ్యమం త్రి ఆప్యాయంగా పాటు వారితో ఫొటోలు దిగుతూ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*సీఎం అభినందనలు*
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబిం చేలా.. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయా లకు ప్రతీకలా.. చక్కని ఏర్పాట్లతో, పలు సాం కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు.


