దర్శి పట్టణంలో శ్రీనివాస థియేటర్ సమీపంలో సంక్రాంతి పండుగ సందర్భంగా డీవైఎఫ్ఎస్ఐ సీఐటీయు సంఘాల ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఆటల పోటీలను మాజీ డీవైఎఫ్ఎస్ఐ నాయకుడు సందు వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలకు లెమన్ అండ్ స్పూన్, స్కిప్పింగ్, మ్యూజికల్ చైర్స్, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఐక్యత కోసం ఆటలు, యువజన మైక్రికి బటలు అనే నినాదంతో అందరూ ఐక్యంగా ఉండాలని వక్తలు అన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే క్రమంలో ఈ సంవత్సరం కూడా ఆటల పోటీలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఎస్ఐ జిల్లా అధ్యక్షులు కేవీ పిచ్చయ్య, సీఐటీయు నాయకులు ఉప్పు నారాయణ, తాండవ రంగారావు, ఉప్పుటూరి నాగరాజు, షేక్ కాలేభాషా, ఈమని నాగేశ్వరరావు, సీహెచ్ ఆదినారాయణ, గర్నెపూడి జాన్, తాండవ రంగారావు, ఆరెస్సీ పాల్, బి. భార్గవ్, కృష్ణారెడ్డి, దేవాన్ల శ్రీను, యలమందారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



