సంక్రాంతి మూడు రోజుల పండుగను పురస్కరించుకొని మండల ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. పనుల కోసం ఉద్యోగాల కోసం వివిధ దేశాలలో రాష్ట్రాల్లో ఉన్నవారు. సొంత గ్రామాలకు చేరుకోవడంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆదివారం సంక్రాంతి పండుగ రావడంతో వేకువ జాము నుంచే నూతన వస్త్రాలు ధరించి దేవాలయాల్లో పూజలు చేశారు. ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలను ఏర్పాటు చేశారు. సంక్రాంతి లక్ష్మికి మహిళలు పూజలు చేశారు. పెద్దల పండుగ కావడంతో కొత్త వస్త్రాలు ధరించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. మరొ పక్క కొత్త అల్లుళ్ళు కోడళ్ళు రాకతో కొత్త కళ కనిపించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇంటిల్లపాది తలంటు స్థానాలు చేసి దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్న ఆహార పదార్థాల తోపాటు పిండి వంటలను ఆరగిస్తూ కబుర్లతో ఉత్సాహంగా గడిపారు. నా ఊరే నా ఇల్లు ముండ్లమూరు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో భోగి .సంక్రాంతి పండుగ రోజున యువకులు క్రికెట్ పోటీలు. కబడ్డీ పోటీలు. వాలీబాల్ పోటీలు .స్లో బైక్ రేస్ పోటీలు. పరుగు పందాలు. ముగ్గుల పోటీలు. ట్రాక్టర్ రివర్స్ పోటీలు. ట్రాక్టర్ ట్రక్కుతో రివర్స్ పోటీలు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.




