మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివారం తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలోని శ్రీ మాధవస్వామి దేవాలయం లోని శ్రీదేవి భూదేవి సమేత మాధవ స్వామి, శివాలయం లోని శ్రీ గంగా పర్వత వర్ధిని సమేత సోమేశ్వర స్వామి వార్లకు గ్రామ వీధులలో ఊరేగింపు జరిగింది. గ్రామ పెద్దలు, భక్తులు వెంట రాగా మేళతాలాలతో ఆలయ పూజారులు శంకర శాస్త్రి, రమణయ్య పంతులు ఆధ్వర్యంలో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం లో మాధవస్వామి టెంపుల్ చైర్మన్ పులిఅంజిరెడ్డి, కమిటీ నెంబర్ సంగనా సుబ్బారెడ్డి, సగిలి నాగేశ్వరావు, సంగనా యోగిరెడ్డ్, వైస్ సర్పంచ్ పులి ప్రసాద్ రెడ్డి, భోగసముద్రం వెంకటేశ్వర్లు, పులి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
