ప్రకాశం జిల్లా కురిచేడు మండలం రెడ్డెన్నపల్లిలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా నిర్వహించారు. పలు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు డి వెంకట్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో దర్శి డిఎస్పి నారాయణస్వామి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. డి.ఎస్.పి నారాయణస్వామి రెడ్డి మాట్లాడుతూ… చిన్న గ్రామీణ ప్రాంతమైన రెడ్డెనపల్లిలో ప్రతి ఒక్క తల్లిదండ్రి కష్టపడి చదివించి విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్రామస్తులు ఐక్యంగా మంచి కార్యక్రమాలు చేయటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన వ్యక్తి కంట్రోల్ ఎస్ సాఫ్ట్వేర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ బ్రహ్మారెడ్డి గ్రామస్తులకు ఐకాన్ గా నిలిచి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నందుకు అభినందనలు తెలిపారు . ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు గ్రామాల పట్ల ప్రత్యేక ప్రేమాభిమానాలు చూపి గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో మొదటగా విద్యార్థుల సౌలభ్యం కోసం బై జ్యూస్ యాప్ ను తీసుకొచ్చారని …అనంతరం ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రత్యేకంగా అసెంబ్లీలో సైతం ప్రస్తావించటం అనంతరం విద్యార్థులందరికీ ప్రభుత్వమే.. బైజూస్ యాప్ ను అందుబాటులోకి తీసుకురావడం… తెలిసిందే అని గ్రామస్తుల ముందు ఆలోచనలకు ఇది ఒక నిదర్శనమన్నారు. గ్రామాల్లో చిన్నపాటి కక్షా కార్పన్యాలు మాని గ్రామ అభివృద్ధికి తమ వంతు చేయూత ఇవ్వడం అభినందనీయమని ….అందుకు రెడ్డెన్నపాలెం ప్రతి గ్రామానికి ఆదర్శమని కొనియాడారు . చిన్నపాటి గ్రామంలో 40కి పైగా సాఫ్ట్వేర్లు ఉండటం అందుకు నిదర్శనమని అన్నారు. గ్రామాన్ని ఐక్యంగా నడిపిస్తున్న గ్రామస్తులు అందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతున్నానని, ఇదే విధానాన్ని కొనసాగించాలని చెప్పారు. గ్రామాలలో ఐక్యంగా ఉంటే తమ డిపార్ట్మెంట్కు చాలా సంతోషమని అన్నారు అనంతరం విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు . కార్యక్రమంలో సర్పంచ్ కాసు భాస్కర్ రెడ్డి ప్రధానోపాధ్యాయుడు డి వెంకట్ రెడ్డి , కంట్రోల్ ఎస్ సాఫ్ట్వేర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కాసు బ్రహ్మారెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


