వైసిపి సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఆయన సోదరులు వైవి భద్రారెడ్డి హనుమారెడ్డిలు సంక్రాంతి సందర్భంగా స్వగ్రామంలో ఉల్లాసంగా గడిపారు ఆయన నివాసంలో ప్రత్యేక కార్యక్రమం అనంతరం సింగరకొండలోని ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారి ఫామ్ హౌస్ లో మొక్కలను పరిశీలిస్తూ తగిన సూచనలు చేశారు అనంతరం గుండ్లకమ్మలో వైవి సోదరులు బోటు షికారు చేశారు. పలువురు ప్రముఖులు వారిని కలిసి ప్రత్యేకంగా సన్మానించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.







