తెలుగు వారి సాంస్కృతిక పండగ సంక్రాంతి –  సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు తాండవ రంగారావు.

తెలుగువారి సాంస్కృతిక పండగ సంక్రాంతి అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు తాండవ రంగారావు , రైతు సంఘం కార్యదర్శి సందు వెంకటేశ్వరరావు , DYFI జిల్లా అధ్యక్షుడు కె.వి పిచ్చయ్య , భూమా ఆదిలక్ష్మి , ఉప్పు నారాయణ మాట్లాడుతూ అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

CITU, DYFI, ఐద్వా ప్రజాసంఘాల అధ్వర్యంలో దరిశి శ్రీనివాస దియేటర్ , సందువారి పాలెం , సాయినగర్ లలో నిర్వహించిన సంక్రాంతి ఆటల పోటీలలో గెలుపొందిన వారికి ఇచ్చిన బహుమతి ప్రదానోత్సవ సభలలో ఆయన మాట్లాడుతూ పెట్టుబడి దారులు వారి లాభాల కోసం విదేశీ సంస్కృతి ని నేడు పెంచుతున్నారని , దానికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు సంక్రాంతి సాంప్రదాయాన్ని , సంస్కృతిని కాపాడుతూ కొనసాగిస్తున్నాయని అన్నారు. ” ఐక్యత కోసం ఆటలు యువజన మైత్రికి బాటలు అనే నినాదంతో ప్రజా సంఘాలు సంక్రాంతి పండుగ సందర్భంగా దరిశి లో 1996 నుంచి ఆటల పోటీలను జయప్రదంగా నిర్వహిస్తున్నామని , దరిశి లో ఈరోజు అనేక సంఘాలు , సంస్థలు ఆటలు నిర్వహించడానికి DYFI సంఘం స్పూర్తిగా అందరికీ నిలిచిందని ఆయన కొనిఆడారు. కుల , మతాలకు వ్యతిరేకంగా యువతి, యువకులలో స్నేహ భావంతో కలసి, మెలసి ఉండటం మన దేశం గొప్పతనం ఉందని దానికి నేడు ప్రమాదం వచ్చిందని ప్రజలంతా దానిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
నేడు గంగిరెద్దుల ఆటలు , ఎడ్ల పందేలు , హరిదాసుల కీర్తనలు , బుడబుక్కల విన్యాసాలు, గొబ్బెమ్మలు , కల్లెపు ముగ్గులు , గ్రామీణా స్థాయి ఆటలు తదితర సాంప్రదాయిక సాంస్కృతికం కనుమరుగు ఆవుతున్నాయని వాటిని కాపాడుకోవడం నేటి ప్రజాతంత్ర వాధుల కర్తవ్యం అని తెలిపారు..
ఈ పోటీలలో గెలుపొందిన కీడాకారులకు ప్రథమ, ద్వితీయ , త్వితీయ , కన్స్ లెషన్ బహుమతులు ప్రజా సంఘాల నాయకులు , స్థానిక పెద్దలు విజేతలకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు, DYFI, ఐద్వా సంఘాల నాయకులు రంగనాయకులు , గర్నిపూడి జాన్ , రమాదేవి , నారాయణమ్మ , ఆదినారాయణ , షేక్ కాలే భాష , నాగేశ్వరరావు , దేవండ్ల శ్రీనివాసరావు , క్రిష్ణారెడ్డి , పుల్లయ్య , లక్ష్మీ , పద్మావతి , కోటేశ్వరరావు , బత్తుల భార్గవ ఆ ప్రాంతాల , మహిళలు , బాల,బాలికలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీలలో పాల్గొన్నవారికి , సహాకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *