‘మాతృ దేవోభవ.. పితృ దేవోభవ.. ఆచార్య దేవోభవ..‘ తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుదే. అందుకే పాఠశాలల్లో గురువులను ‘సార్.. మేడమ్..’ అని చాలా గౌరవంగా సంభోదిస్తుంటాం. అయితే, ఇకపై వారిని అలా పిలవక్కర్లేదని కేరళ బాలల హక్కుల కమిషన్ పేర్కొంది. ఈ రెండు పదాలను పాఠశాలల్లో ఇకపై వాడొద్దని తెలిపిన చైల్డ్ రైట్స్ కమిషన్, ఉపాధ్యాయుడు/ ఉపాధ్యాయిని ఎవరినైనా ‘టీచర్’ అని మాత్రమే సంబోధించాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా విద్యాశాఖను ఆదేశించింది.
సార్, మేడమ్ అని కాకుండా టీచర్ అని పిలవడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య అనుబంధం మరింతగా పెరుగుతుందని బాలల హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. టీచర్ అనే పదం పురుషులకు, మహిళలకు ఇద్దరికీ వర్తిస్తుందని, విద్యార్థి దశలోనే పిల్లలకు స్త్రీ, పురుషులిద్దరూ సమానమే (లింగ సమానత్వం)నని చెప్పేందుకే ఇది సరైనదని కమిషన్ తన ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాకుండా.. టీచర్ అని పిలవడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య అనుబంధం మరింతగా పెరుగుతుందని చెప్పుకొచ్చింది. కేవీ మనోజ్, విజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ ప్రటకన చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.
బాలల హక్కుల కమిషన్ కీలక నిర్ణయం.. ఇకపై పిల్లలు ‘సార్.. మేడమ్’ అనటాల్లేవ్! టీచర్ అని మాత్రమే సంబోధించాలి – కేరళ బాలల హక్కుల కమిషన్ ఆదేశం
16
Jan