సంక్రాంతి పండుగను ఆదివారం ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొంగళ్లు పొంగించారు. కొత్తపాలెంలో జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, ట్రాక్టర్ పోటీలు పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. తాళ్లూరులో కోలాటం, కొర్రపాటి వారి పాలెంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పాటల కచేరీలు నిర్వహించారు. బొద్దికూరపాడులో మాధవస్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత మాధవ స్వామి, శివాలయంలో గంగా పార్వత వర్ధని సమేత సోమేశ్వర స్వామి వార్లకు పూజారులు శంకర శాస్త్రి, రమణయ్యల ఆధ్వర్యంలో గ్రామోత్సవం నిర్వహించారు. చైర్మన్ పులి అంజిరెడ్డి, ఉప సర్పంచి పులి ప్రసాద రెడ్డి, కమిటీసభ్యులు పాల్గొన్నారు. దారం వారిపాలెంలో యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పొటీలు, ట్రాక్టర్ రివర్స్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించారు. వైస్ ఎంపీపీ ఎంపీ నాగార్జునరెడ్డి, సర్పంచి ఎం వెంకటేశ్వరరెడ్డి. సొసైటీ చైర్మన్ మంచాల వలసారెడ్డి, ఉప సర్పంచి ఇంద్రసేనా రెడ్డి, ఎఎంసీ డైరెక్టర్ రమణారెడ్డి తదితరులు బహుమతులు అందించారు. తాళ్లూరు మండలంలో నాగంబొట్లవారిపాలెంలో నరసింహా స్వామికి పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించారు. మొక్కుబడి ప్రభలను ఏర్పాటు చేసారు. గుంటి గంగా భవాని, కొత్తపాలెం. నాగం బొట్లవారిపాలెం సాయి బాబ, తూర్పు గంగవరం కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాలలో, పోలేరమ్మ ఆలయాలలో భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
కనుమ పండుగ నిర్వహణ ..
కనుము పండుగను సోమవారం నిర్వహించుకున్నారు. హిందువులు బోగితో మొదలై కనుమతో పండుగను మూడు రోజుల పాటు సంప్రదాయ బద్దంగా నిర్వహించుకుంటారు. ఆయా గ్రామాలలో బంధు మిత్రులతో గ్రామాలు కళ కళ లాడాయి.


