ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు వైవీ భద్రా రెడ్డిలకు తాళ్లూరు మండల ప్రజా ప్రతినిథులు సోమవారం కలిసి సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మ పీడీ శ్రీనా రెడ్డిని కలసి జన్మదిన శుభాకాంక్షలతో పాటు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, గంగిరెడ్డిపాలెం యలమందా రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.


