జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు..పూజారులు విజయలక్ష్మి, ప్రకాశరావు ఆధ్వర్యంలో పూజలు
నిర్వహించారు. అమ్మవారికి భక్తులు ఐదు చీరలు బహుకరించారు. ఆలయానికి రూ. 26,795 ఆదాయం వచ్చినట్లు ఆర్ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. దర్శి డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్సై నరసింహారావు ప్రత్యేక పూజలు చేసారు. దర్శి డీఎస్సీ దంపతులను పూజారి విజయలక్ష్మి ప్రత్యేక సారే ఇచ్చి పూజలు నిర్వహించారు. సౌకర్యాలను ఆలయ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, ఈఓ భాస్కర్ రెడ్డి, ఆలయ అధికారి శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
