దర్శి నగర పంచాయతీలోని వెలమ వారి వీధిలో సంక్రాంతి సంబరాలలో భాగంగా ఆటలు ముగ్గుల పోటీలను ఏఐటీయూసీ ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ సంఘాల నాయకులు నిర్వహించారు. ముందుగా ఆటల పోటీలను దర్శి ఎస్ఐ డి రామకృష్ణ ప్రారంభించారు. ఈ పోటీలలో అత్యంత ఉత్సాహభారతమైన వాతావరణంలో జరిగాయి. పిల్లలకు స్లో సైక్లింగ్, లెమన్ స్పూన్, గోతాల దూకుడు, కుర్చీలాట మొదలైన ఆటలు ఆడారు. మహిళలకు కుర్చీలాట ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో అధిక మంది మహిళలు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఏఐటీయూసీ దర్శి నియోజకవర్గ ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన దర్శి ఎస్ఐ డి రామకృష్ణ మాట్లాడుతూ .. పండుగ రోజున ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వలన ప్రజలకు గ్రామీణ ప్రాంతాలలో ఐక్యత ఏర్పడుతుందని పరిచయాలు ఏర్పడతాయని ఆయన అన్నారు. ఇంతమంది ఒకే చోట ఉండడం వలన అసలైన పండుగ వాతావరణ కనిపిస్తుందని అన్నారు. ఈ పోటీలు ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్,ఎఐఎస్ఎఫ్ నాయకులను అభినందించారు. మరో ముఖ్యఅతిథిగా హాజరైన దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి మాట్లాడుతూ .. భారతదేశంలోనే సంక్రాంతి పండుగ పెద్ద పండుగని ధాన్యం ఇంటికి వచ్చి కొత్త అల్లుళ్లతో సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అన్నారు. అనంతరం పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి బలుమూరి మాధవి, ద్వితీయ బహుమతి బలుమూరి జోష్ణ, మూడో బహుమతి జూపల్లి కావ్య, నాలుగవ బహుమతి ఒడిశా వానికి దక్కింది. వీరికి ఎస్ఐ డి రామకృష్ణ, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి , రావుస్ ఫర్నిచర్స్ అధినేత చేబ్రోలు సుధాకర్, మౌనికలు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు, కల్లూరి చిన్న ఆంజనేయులు, సింగరకొండ శ్రీను, మహేష్, తిమోతి, సంఘ సేవకుడు జీవి రత్నం, అన్నవరపు వెంకటేశ్వర్లు, జి ప్రేమ్ కుమార్, కే మార్క్ తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణయితలుగా సంగు యోగేశ్వరి, భూమా ఆదిలక్ష్మి, సంగు సునీతల వ్యవహరించారు.


