ముండ్లమూరు మండలంలో సంక్రాంతి కనుమ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల్లోని ప్రజలు సంక్రాంతి పండుగ కనుమ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ఆటపాటలు. సాంస్కృతిక కార్యక్రమాల లో ప్రజలు విశేషంగా పాల్గొని ఆనందోత్సాల నడుమ సంతోషంగా గడిపారు మండల కేంద్రమైన ముండ్లమూరులో నా ఊరే నా ఇల్లు ముండ్లమూరు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ. వాలీబాల్ .మ్యూజికల్ చైర్స్. లెమన్ అండ్ స్పూన్ ఆటలు. పరుగు పందెం. క్రికెట్. స్లో బైక్ రేస్. ట్రాక్టర్ ఇంజన్ రివర్స్ పోటీలు. ట్రాక్టర్ ట్రక్కు రివర్స్ పోటీలు. ముగ్గుల పోటీలు. చిన్నారులతో డ్యాన్స్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు ఏర్పాటు చేశారు. సంక్రాంతి లక్ష్మి కు మహిళలు పూజలు చేశారు. పెద్దలపండుగ కావడంతో కొత్త వస్త్రాలు ధరించారు. మహిళలు ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. మరోపక్క కొత్త అల్లుళ్ళు కోడలు రాకతో కొత్త కళా సంతరించుకుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇంటిళ్లపాది తలంటు స్నానాలు చేసి కొత్త దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగకు రకరకాల పిండి వంటలు తయారు చేసుకొని ఆరగిస్తూ కబుర్లతో ఉత్సాహంగా గడిపారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో శోభాయ మానంగా అలంకరించారు.
