ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ నివాసంలో సంక్రాంతి సంబరాలు సందడిగా జరిగాయి. కలెక్టర్ దినేష్ కుమార్, ఆయన సతీమణి బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృ ష్ణన్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తొలి పండు గను ఘనంగా జరుపుకున్నారు. ప్రకాశం. బాపట్ల జిల్లాల ఎస్పీలు మలికాగర్గ్, వకుల్ జిందాల్ దం పతులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇరువురు ఐఏఎస్ దంపతులు, ఐపీఎస్ దంపతులు వారి పిల్లలు బంధుమిత్రులతో కలిసి కలెక్టర్ నివాసంలో సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. పొంగళ్లు పెట్టారు. గంగిరెద్దుల విన్యాసాల నడుమ సంప్రదా యబద్ధంగా పండుగను జరుపుకున్నారు.
కలెక్టర్ ఇంట సంక్రాంతి సందడి – హాజరైన ప్రకాశం, బాపట్ల కలెక్టర్లు ఎస్పీలు
16
Jan