నువ్వు నూనె గింజల స్వల్పకాలిక పంట, తక్కువ పెట్టుబడితో నికరాదాయం వస్తుందిని అన్నదాతల ‘నమ్మకం’. ఈ రబీ లేదా వేసవి సీజన్లో సాగు నీటి వనరులున్న ప్రాంతాల్లో నువ్వు పంట వేశారు. నువ్వు పంటలో వెర్రి తెగులు ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడి సాధించవచ్చని శాస్త్రవేత్తలు కీటక శాస్త్రవేత్త డాక్టర్ జాహ్నవి, కెవికె కోఆర్డినేటర్ డా. ఎస్ వి వి ఎస్ దుర్గా ప్రసాద్, తెలిపారు.
వెర్రి తెగులు లేక పీలోడి లేక చీపురు కట్ట తెగులు:
ఈ తెగులు పూత సమయంలో ఆశిస్తుంది. ఇది మైకోప్లో స్మా ద్వారా సంక్ర మించే వ్యాధి.
లక్షణాలు వ్యాధి లక్షణాలు మొక్కలు పుష్పించే దశలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పుష్పా లలోని అన్ని భాగాలు ఆకులుగా మారుతాయి. మొక్కపై ఆకులు చిన్నవి గాను మరియు గుత్తులు గుత్తులుగాను ఏర్పడ తాయి. వ్యాధి పోకిన మొక్కలలో ఎక్కువ శాఖలు ఏర్పడి కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. ఈ మొక్కలు పూత పూయవు మరియు కాయలు కాయవు. ఒకవేళ కాయలు ఏర్పడతే అందులో నాణ్యమైన గింజలు వుండవు. ఈ తెగులు ఒరోపియన్ ఆల్బి సింక్టస్ అనే (దీపపు పురుగుల) జాసిడ్ ద్వారా వ్యాపిస్తుంది. సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటలో ఎక్కువగా వస్తుంది..
అనుకూల పరిస్థితులు :
పొడి వాతావరణం, మధ్యస్థ ఉష్ణోగ్రత (25 ° C), తేమ శాతం (65%), కనిష్ట వర్షపాతం (0.6 మి.మీ) మరియు ఫిబ్రవరి మార్చలో పొడి కాలం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం.
వ్యాధిని వ్యాప్తి చేసే దీపపు పురుగులు బ్రసికా, కోటలేరియా, వేరుశనగ మరియు కొన్ని కలుపు మొక్కల పై అతిధేయగా జీవించి ఉంటుంది. పిల్ల పురుగులు తెగుల వ్యాప్తిని చేయలేవు. దీపపు పురుగుల జనాభా వేసవికాలంలో ఎక్కువగా మరియు శీతాకాలంలో తక్కువగా ఉంటాయి.
నివారణ: తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి తగులబెట్టాలి.
ప్రత్తి మరియు వేరుశనగ పంటల వద్ద నువ్వు పంట వేయరాదు. పైరుపై డైమిధోయేట్ 30% ఇ.సి. @ 2 మి.లీ లేదా ఇమిడాకోసిడ్ 17.8 % ఎస్.ఎల్. @ 0.3 మి.లీ లేదా అసిటామిప్రిడ్ 20% ఎస్.పి @ 0.3 గ్రా లేదా దయో మిధాక్సాను 25% డబ్ల్యూ.జి @ 0.3 గా లేదా ధయో కో 21.7% ఎస్.సి @ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకొని దీపపు పురుగులను అరికట్టాలి.
