పండుగలు సంప్రదాయ బద్ధంగా నిర్వహించటం వల్ల ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని, అందరూ ఆనందంగా ఉంటారని వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర అన్నారు. మండలంలోని కొత్తపాలెంలో సోమవారం రాత్రి సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పలు పోటీలలో విజేతలకు బహుమతులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలలో రైతు వారిపని వత్తిడిలో ఉన్నప్పటికి జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్న రైతులను, యువకులను, మహిళలను అభినందించారు. అనంతరం మద్దిశెట్టి రవీంద్రను నిర్వాహకులు, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి. వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎం.ఎన్.పి నాగార్జున రెడ్డిలు, సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచి కాశిరెడ్డి, గంగిరెడ్డి పాలెం యలమందారెడ్డి, మేకల నాగేశ్వరావులు ఘనంగా సన్మానించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
