శనగ సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. మల్కాపురం, రాజానగరం గ్రామాలలో సాగు చేసిన శనగ పైరు ఆయన మంగళవారం పరిశీలించారు. శన పంటలో వచ్చే
తెగుళ్లు, యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. ఉత్తమ యాజమాన్య
పద్ధతులలో తక్కువ పెట్టుబడులు, అధిక దిగుబడులు పొందాలని కోరారు.
కార్యక్రమంలో సర్పంచి వలి, ఎంపీటీసీ వెంకట రామిరెడ్డి, ఎఈఓ నాగరాజు, విఏఏ
అశోక్ తదితరులు పాల్గొన్నారు.
