ముండ్లమూరు మండలంలోని పోలవరం గ్రామంలో 20 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటీవల గ్రామంలో గడపగడపకు మన కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆ గ్రామస్తులు సిమెంటు రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ను కలిసి విన్నవించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే 20 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. గ్రామ వైసిపి సీనియర్ నాయకులు నెమలిది న్నె.సుబ్బారెడ్డి నిర్మాణ పనులు చేపట్టారు. గ్రామ సర్పంచి నంబూరు లీలమ్మ ఏసు పనులను పర్యవేక్షించి నాణ్యతగా చేపట్టాలని సూచించారు. దీంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గ్రామంలో ఎన్నడూ లేని విధంగా సిమెంట్ రోడ్లు వేస్తూ ఉండడంతో బీసీ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దగ్గరుండి సిమెంటు రోడ్డు పనులు చేయిస్తున్న నెమలిదిన్నె సుబ్బారెడ్డిని బీసీ కాలనీవాసులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముతికేపల్లి కృష్ణారెడ్డి. సన్నపురెడ్డి వెంగళరెడ్డి. మిట్ట సుబ్బారెడ్డి. కొనతం అంజిరెడ్డి. చల్ల అంజయ్య. కొనతం కోటిరెడ్డి. వల్లెపు బాబు. గజ్జెల వీర రాఘవరెడ్డి. వల్లెపు రాముడు. బండారు బ్రహ్మయ్య. తదితరులు పాల్గొన్నారు.
20 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు
ఫోటో నెంబర్0 3- సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని పరిశీలిస్తున్న సుబ్బారెడ్డి
18
Jan