ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు
ఎస్సై సంపత్ కుమార్

రోడ్డు ప్రమాదాల నివారణకు క ట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటానని నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ ఐ ఎల్ సంపత్ కుమార్ అన్నారు. స్థానిక ముండ్లమూరు పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదాల నివారనే లక్ష్యంగా రెడ్ జోన్ ప్రాంతాలను గుర్తించి నిఘా పెంచుతామన్నారు. వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి భద్రత చర్యల పట్ల తీసుకోవాల్సిన చర్యలపై వివరించడం జరుగుతుందన్నారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నివారిస్తామన్నారు. అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *