గ్రామపంచాయతీలలో పని చేస్తున్న పారిశుద్ధ్యకార్మికులకు జీతాలు చెల్లించాలని ఈవో పి ఆర్ డి .పి ఓబులేసు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబులేసు మాట్లాడుతూ మార్చి 15వ తేదీ లోపల నూరు శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలన్నారు. గ్రామా లు పరిశుభ్రంగా ఉండేందుకు కార్యదర్శులు దృష్టి సారించాలన్నారు. ప్రజల నుండి స్పందన లో వచ్చిన దరఖాస్తులను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యకార్మికులు సేకరిస్తున్న తడి పొడి చెత్తను డంపింగ్ యార్డ్ లో వేరువేరుగా వేసి ఎండబెట్టి వర్మీ కంపోస్టు ఎరువులుగా తయారు చేయించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ఆ ఎరువులను విక్రయించి వాటి ద్వారా వచ్చిన నగదును గ్రామాల అభివృద్ధికి ఉపయోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
