ఫార్మల్ ఇంటరెస్టింగ్ మహిళా గ్రూపుల ద్వారా మహిళల ఆర్ధిక అభివృద్ధితో పాటు, వారి బహుళ ప్రయోజనాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మండల వ్యవసాయ అధికారి బి.ప్రసాదరావు అన్నారు. మండలం లోని తూర్పు గంగవరం గ్రామంలో గల రైతు భరోసా కేంద్రంలో మహిళా రైతుల నుద్దేశించి ఆయన ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాళ్లూరు మండలంలో 7వేలకు పైగా మహిళలు వ్యవసాయం వాటి అనుబంధ రంగాలలో ఆధారపడి జీవిస్తున్నారని, వారిని ఎఫ్ఎస్ఐజి
గ్రూపులుగా ఏర్పాటు చేసి వారి ద్వారా పొదుపును ప్రోత్సహించి, భవిష్యత్తులో వారి ఆర్థిక అభివృద్ధికి గ్రామ మహిళా సమాఖ్య
సభ్యులు కృషి చేయాలని ఆయన తెలిపారు. తూర్పు గంగవరం గ్రామంలోని ఏపీజీబీ , యూనియన్ బ్యాంకుల ఆధ్వర్యంలో బ్యాంకు ఖాతాలను ప్రారంభించి వారి చేత పొదుపు చేయిస్తూ, పుస్తక నిర్వహణ, తదితర విషయాలను సక్రమంగా పాటించినట్ల యితే ప్రభుత్వం నుండి మహిళా రైతులకు అందుతున్న పథకాలు వారికి చేరువలోకి వచ్చి, వ్యవసాయ రంగంలో అభివృద్ధిని సాధించడంతో పాటు, వారి కుటుంబాలను కూడా అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని మహిళా రైతుల సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు సుమ, బ్యాంకు మిత్ర విజయలక్ష్మి, వివో ఏ సభ్యులు, మహిళా రైతులు పాల్గొన్నారు.
ఎఫ్ఎస్ఐజీ గ్రూపుల ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి – మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు
20
Jan