ఫ్యామిలీ ఫిజియన్ కాన్పేఫ్ట్లో గ్రామీల చెంతకే వైద్యం అందుతున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్. రాజ్యలక్ష్మి అన్నారు. తాళ్లూరు మండలంలోని తాళ్లూరు, తూర్పు గంగవరంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను, మాధవరం సచివాలయం పరధిలో జరుగుతున్న ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సఫ్ట్ వైద్యంను ఆమె శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే గర్భిణుల పూర్తి వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని వైద్యులకు సూచించారు. గర్బిణులకు ఇచ్చె ఐరన్ మాత్రలు. చిన్న పిల్లలకు ఇస్తున్న టీకాలను క్రమం తప్పకుండా వెయ్యాలని సూచించారు. ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ప్రతి ఉద్యోగి మూడు సార్లు ముఖ హాజరు తప్పకుండా వెయ్యాలని తెలిపారు. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కార్యక్రమంలో గర్భిణీలను, బాలింతలు నవ జాత శిశు సంరక్షణ సేవలు, పిల్లల్లో జబ్బులు, ఎదుగుదల, పౌష్టికాహార లోపాలు గుర్తించేందుకు పరీక్షలు. బి.పి. ఘగర్ ఇతర కమ్యూనికెబుల్ డిసీజెస్, రోగులకు దీర్ఘకాల వ్యాధులతో బాధపుడుతన్న వారిని వైద్యులు వారి నివాసాల వద్ద పరీక్షించి సత్వర చికిత్స ద్వారా అవసరమైన వారికి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్సకు సిఫార్స్ చేస్తారని, అందులో వైద్యం చేయించుకున్న వారి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తారని చెప్పారు. ఆ కాన్సెఫ్ట్లో 14 రకాల “డయాగ్నోస్టిక్, 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
తాళ్లూరు వైద్యశాలలో సమాచార హక్కు చట్టం బోర్డుపై పాత డీఎంహెచ్ పేరు మాత్రమే ఉండటం, సరియైన సమాచారం లేక పోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వైద్యశాల ఎందువలన నాడు- నేడు పనులు ఆలస్యం అవుతున్నాయని, రోగులకు ఇలా ఉంటే ఇబ్బందులు పడతారని త్వరగా పనులు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తూర్పుగంగవరంలో వైద్యశాలలో రోగులకు అందుతున్న సేవలను, ఇతర సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. మాధవరంలో ఫ్యామిలీ ఫిజిషియన్లో అందుతున్న సేవలను, రోగులను ఆడిగి అభిప్రాయాలను తీసుకున్నారు. ఆయా కార్యక్రమాలలో తూర్పు గంగవరం పీహెచ్సీ ‘వైద్యుడు బి. రత్నం, వైద్యుడు హనుమానాయక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




