తాళ్లూరు పోలీస్ స్టేషన్ (ఎస్సై) ఎస్ఆచిగా బి. ప్రేమ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఒంగోలు డిసీఆర్బిలో పనిచేస్తూ బదిలీపై తాళ్లూరు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్సై మాట్లాడుతూ మండలంలో ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తానని, తాళ్లూరు, తూర్పుగంగవరంలలో ట్రాఫిక్ నియంత్రకు, చోరీల నియంత్రణ, ఇతర అసాంఘిక చర్యల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. స్టేషన్ ను వచ్చే ప్రజలు నేరుగా తనను కలసి సమస్యను విన్నవించుకోవచ్చని చెప్పారు. ముందుగా జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని ఆలయంలో ఎస్సై ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు చేసారు. ఆలయ కమిటీ చైర్మన్ కటకం శెట్టి శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఎఎస్సై మోహనరావు, సిబ్బంది నూతన ఎస్సైకు మర్యాద పూర్వకంగా కలిసారు. వారికి ఎస్సై పలు సూచనలు చేసారు. పలువురు వైఎస్సార్సీపీ నాయకులు ఎస్సైను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్రను కలిసిన ఎస్సై …. తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్రను ఎస్సైప్రేమ్ కుమార్ దర్శిలో ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు. మండలంలోని పరిస్థితులపై వారు చర్చించుకున్నారు.


