శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు

గ్రామాల లో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టు దిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై ఎల్ సంపత్ కుమార్ అన్నారు. మండలంలోని మారెళ్ళ. మక్కినేనివారి పాలెం. ఈదర. ఉమామహేశ్వరపురం. పూరి మెట్ల. జమ్మలమడక , ఉలగూళ్ళు గ్రామాలలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలకు అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామాల్లోని ప్రజలు చిన్న చిన్న సమస్యలకు పంతా లు పట్టింపుల కు పోకుండా ఉండాలన్నారు. అనవసరమైన గొడవలు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తప్ప వన్నారు. గ్రామాల్లో కోడిపందాలు వేయడం. పేకాట ఆడడం. నాటు సారా తయారు చేయడం వంటివి చేస్తే అట్టి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందన్నారు. ఉల్లగల్లు గ్రామాల్లో పర్యటించి రోడ్డు ప్రక్కన ఆక్రమించి ఉన్న దుకాణాలను సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలు నేరుగా ఎస్ఐ ని కలిసి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అంకమ్మరావు. కానిస్టేబుల్ విజయ్ కుమార్. సూరిబాబు. ప్రేమ నిధి. తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *