సారాయి, గంజాయి ల పై ఉక్కుపాదం- ఒంగోలు SEB Superintendent ఎ.ఆవులయ్య

సారాయి, గంజాయి, డ్రగ్స్ వంటి హానికర మత్తు పదార్ధాలను ప్రకాశం జిల్లా నుండి కూకటివేళ్ళతో పెకిలిస్తామని ఒంగోలు SEB Superintendent ఎ.ఆవులయ్య పేర్కొన్నారు. దర్శి SEB స్టేషన్ ను శుక్రవారము ఆయన ఆకస్మికముగా తనిఖీ చేసారు. ముందుగా సిబ్బంది పనితీరును సమీక్షించి వారికి సూచనలు, సలహాలు అందించారు. రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. ఈ సందర్భముగా మాట్లాడుతూ … పరివర్తన-1, పరివర్తన కార్యక్రమాల ద్వారా జిల్లా నుంచి సారాయిని దాదాపుగా ప్రారద్రోలామన్నారు. ఒక్క దర్శి SEB స్టేషన్ లో గడచిన ఏడాదిలో (2022) 17 సారాయి కేసులు నమోదు చేయగలిగామన్నారు. ప్రస్తుతం గంజాయి పై పూర్తి స్తాయి దృష్టి సారించి దాని మూలాలను పెకలిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుండి అక్రమముగా రవాణా అవుతున్న పన్ను కట్టని మద్యం (NDPL) పై కూడా తమ సిబ్బంది నిశితముగా దృష్టి సారించారన్నారు. జిల్లా యస్.పి, అడిషనల్ యస్.పి ల ఆధ్వర్యములో SEB, POLICE శాఖలుఒకటిగా కలసిపోయి పనిచేయడము వల్లె సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో SEB C.I, బి.సుందర రామయ్య, S.I యం.శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *