గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న మహిళా పోలీసులు బాధ్యతగా పనిచేయాలని ఎస్సై ఎల్ సంపత్ కుమార్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించి వారిపై నిఘా పెంచాలన్నారు. గుట్కా బెల్ట్ షాపుల అమ్మకాలపై ప్రజలను చైతన్యవంతులుగా చేయాలన్నారు. దొంగతనాలు జరగకుండా చూడాలన్నారు. కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లయితే వారి వివరాలు సేకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుళ్లు ప్రేమానిది. మరియ బాబు. ఏసుబాబు. తదితరులు పాల్గొన్నారు
మహిళా పోలీసులు బాధ్యతగా పనిచేయాలి -ఎస్సై సంపత్ కుమార్
21
Jan