ముండ్లమూరు మండలంలోని ఉల్లగల్లు పంచాయతీ పరిధిలో గల లక్ష్మీ నగర్ గ్రామానికి చెందిన యర్రేడ్ల సుబ్బారెడ్డి సుబ్బమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలకు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు యర్రెడ్ల అనంతారెడ్డి తెలిపారు. అందులో భాగంగా మండల కేంద్రంలో గల ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల3 0 ఎస్ టి కుటుంబాలు చెందిన వారికి దుప్పట్లు చీరలు పంపిణీ చేసి వారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు. పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 20 సంవత్సరా లుగా ఉత్తరాఖండ్. దక్షిణాఖండం. రామేశ్వరం. కేరళ. తమిళనాడు. బద్రీనాథ్. శ్రీశైలం. బెంగళూరు. తెలంగాణ వంటి రాష్ట్రాలలో దుప్పట్లు చీరలు పంపిణీ చేశామన్నారు. రామేశ్వరం. శ్రీశైలం. దేవాలయాలలో సేవా సంఘం తరఫున అన్నదాన కార్యక్రమాలు నేటికీ జరుగుతున్నాయని ఆయన తెలిపారు. యర్రేడ్ల సుబ్బరామిరెడ్డి (మనవడు) పేరు మీద ఆరోగ్య శిబిరాలు. కంటి వైద్య శిబిరాలు. గుండె వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు మందులు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు
పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ
21
Jan