గ్రామాల్లో మౌలిక వసతులతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని ఎంపీడీవో కే కుసుమకుమారి అన్నారు. మండలంలోని పోలవరం గ్రామంలో జరుగుతున్న సిసి రోడ్లను శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిసి రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇటీవల గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో గ్రామాల లోని సమస్యలను గ్రామస్తులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణు గోపాల్ దృష్టికి తీసుకు వెళ్ళగా స్పందించిన ఎమ్మెల్యే 20 లక్షలు రూపాయల నిధులు మంజూరు చేయించారు. దీంతో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుంకర బ్రహ్మానంద రెడ్డి. జడ్పిటిసి తాతపూడి మోజేష్ రత్నం రాజు. మండల వైసీపీ సీనియర్ నాయకులు నెమలిదిన్నె సుబ్బారెడ్డి( మాజీ సైనికుడు) ముతికేపల్లి కృష్ణారెడ్డి. గ్రామస్తులు పాల్గొన్నారు.
సీసీ రోడ్లతో గ్రామాల అభివృద్ధి
21
Jan