ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర, ధాన్యం కొనుగోలు కేంద్రాలతో ధాన్యానికి మంచి ధర వస్తుందని వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. తాళ్లూరు మండలంలోని 14 రైతు భరసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటె తక్కువగా అమ్ముకోవద్దని అవగాహన కల్పిస్తూ శనివారం అవగాహన ర్యాలీ చేపట్టారు. రైతులు సంబంధిత ఆర్బికేలతో విఏఏలను సంప్రదించాలని కోరారు.