స్సీ, ఎస్టీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా
గ్రామాలలో కౌలు, వ్యవసాయ రైతులు సాగు చేస్తు పంటలు పండిస్తున్న ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా ఈ-క్రాప్ లొ నమోదు చేయించు కోవాలని తాళ్లూరు మండలం దారంవారిపాలెం గ్రామంలో మండల స్థాయి లొ ఎస్సీ ఎస్టీ రైతులకు వ్యవసాయ అభివృద్ధి పథకాలపై అవగాహన సదస్సు లో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ జిల్లా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు తెలియజేశారు. బీమా భాయ్ గ్రామ సంఘం అధ్యక్షురాలు ఆబోతు వెంగమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామస్థాయిలో కౌలు రైతులు వ్యవసాయం భూమి తీసుకుని సాగుచేస్తున్న రైతులు తప్పనిసరిగా సి సిఆర్సీ కార్డు పొంది రైతు భరోసా లొ నమోదు చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుండి అనేక రాయితీలతో కూడిన పథకాలు కౌలు రైతులు కూడా వర్తింపజేస్తున్నారని ఆమె తెలియజేశారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ముండ్లమూరు కమ్యూనిటీ మొబిలైజర్ గోపన బోయిన వెంకట్రావు మాట్లాడుతూ కౌలు రైతులు” పంట సాగుదారుల చట్టం 2019 ప్రకారం కౌలు రైతులను ఆదుకునేందుకు కౌలు కార్డులు అనగా సి సి ఆర్ సి మంజూరు చేసి రైతు భరోసా ల ద్వారా బ్యాంక్ రుణాలు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పంటలు నష్టం వాటిల్లినపుడు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించుటకు కృషి చేస్తుందని, సి సి ఆర్ సి వలన రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలకు అమ్ముకోవటానికి మార్కెట్ యార్డులో అవకాశాలు ఉంటాయని, ఇ -క్రాఫ్ నమోదు చేసుకోవటం వలన ఎస్సీ ఎస్టీ రైతులు వ్యవసాయ అభివృద్ధి వైపు పయనించడానికి ఎక్కువ అవకాశం ఉన్నదని ఆయన తెలియజేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క రైతు, కౌలు రైతులు వ్యవసాయ అభివృద్ధి పథకాలను ఉపయోగించుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కాల్వ సువర్ణ, రోశయ్య,దాసు మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ఎస్సీ ఎస్టీ రైతులు పాల్గొన్నారు.
ఎస్సీ ఎస్టీ రైతులు వ్యవసాయ అభివృద్ధి పథకాలు వినియోగించుకోవాలి.
21
Jan