దరిశి నగర పంచాయతీ పరిధిలోని పొదిలి రోడ్డులో డియస్పీ కార్యాలయం ఎదురుగా కర్టీస్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి స్థలములో అక్రమంగా నిర్మిస్తున్న భారీ కట్టడాలను నిలిపివేయాలని నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు, డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ, సామాజిక ఉద్యమ నాయకులు జి. దేవప్రసాద్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
దరిశి డియస్పీ నారాయణ స్వామి రెడ్డిని శనివారం కలిసి వినతి పత్రం సమర్పించారు. దరిశి నగర పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 791/2లో అమెరికన్ బాప్టిస్ట్ ఫారిన్ మిషన్ సొసైటీకి చెందిన 9 ఎకరాల స్థలంలో 30 సెంట్లు స్థలాన్ని కర్టీస్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చికి కేటాయించారని, చర్చికి చెందిన 30 సెంట్లు స్థలంలో చర్చి నిర్మాణం కోసం 15 సెంట్లు స్థలాన్ని ఉల్లి రాములు, నాగేశ్వరరెడ్డి, ఉల్లి బాబు, ఎదురు చంద్రశేఖరరెడ్డిలకు అమ్మారని అన్నారు.
చర్చి స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తులు మరియు అమ్మిన వ్యక్తులు 3 సంవత్సరాల నుండి చర్చికి ఇవ్వవలసిన డబ్బును ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. చర్చి ప్రావర్టీ కస్టోడియన్స్ గా ఉన్న ముక్తిపూడి దేవసహాయం(లేటు), రొక్కరూకల దిలీప్ కుమార్, చర్చి ప్రెసిడెంట్గా ఉన్న పీటర్, ట్రెజరర్ నూనె సువర్ణరాజు(లేటు) అనువారలు 15 సెంట్లు స్థలం అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో చర్చి నిర్మాణం చేపడతామని చెప్పినట్లు వారు పేర్కొన్నారు. చర్చి కస్టోడియన్స్ మరియు చర్చి స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తులు కర్టీస్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి నిర్మాణానికి తోడ్పడటంలేదని అన్నారు. వారం రోజుల లోపల చర్చి నిర్మాణానికి ఇవ్వవలసిన 60 లక్షల రూపాయలు ఇవ్వకపోతే చర్చి స్థలంలో నిర్మించిన కాంప్లెక్స్ ముందు రిలే, నిరాహార దీక్షలు చేపడతామని వారు తెలిపారు.
కర్టీన్ మెమోరియల్ చర్చి స్థలములో అక్రమ కట్టడాలను నిలిపివేయాలి –
నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు, డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్
21
Jan