మోటారు సైకిల్ వాహనం నడిపేవారు హెల్మెట్ ను ,కారు నడిపేవారు సీటు బెల్టు ను తప్పనిసరిగా పెట్టుకోవాలని ఎంవీఐ రవికుమార్ , ఎస్సై రామకృష్ణ సూచించారు. 34వ జాతీయ రహదారి భద్రతా వారోత్స వాలు పురష్కరించుకుని ప్రజలకు రోడ్ నిబంధనలు తెలియ చేస్తూ శనివారం అధికారులు హెల్మెట్లు ధరించి మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పొదిలి రోడ్డులో రవాణా శాఖ కార్యాలయం నుండి దర్శి గడియారస్తంభం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి గడియారం స్తంభం సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి డ్రైవర్ల హెల్మెట్ ప్రాధాన్యత వివరిస్తూ..
హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకునే విధంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎంబీఐ రవికుమార్ మాట్లాడుతూ… మోటారు సైకిల్ ప్రయాణాలు అధికంగా హెల్మట్లు లేకపోవడం వలన ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ హెల్మెట్లు పెట్టుకుంటే ప్రాణాపాయం జరగకుండా వందకి 90శాతం అయినా రక్షణ పొందుతారని చెప్పారు. సీట్ బెల్టు పెట్టుకుంటే ప్రమాదాలు జరిగేటప్పుడు సకాలంలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయి ప్రాణాల నుండి రక్షణగా ఉపయోగపడతాయని సూచించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా కాకుండా ఉండటం కోసం డ్రైవర్లకు పలు సూచనలు సలహాలు సూచించారు. కార్యక్రమంలో ఎస్సై రామకృష్ణ, ఎంవీఐ రవికుమార్, దర్శి రవాణా శాఖ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
డ్రైవర్లకు ఉచిత మెగా క్యాంపు…
దర్శి నియోజకవర్గంలో పనిచేస్తున్న వాహనదారులు నడిపే డ్రైవర్లకు ఉచిత మెగా క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఎంవీఐ రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శి నియోజకవర్గం పరిధిలోని వాహనాలు నడుపుతున్న వాహనదారులు డ్రైవర్లకు ఉచిత మెగా క్యాంపు పొదిలి రోడ్డులో ఉన్న బ్రేక్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు దీనిని డ్రైవర్ లు ఉపయోగించుకోవాలని ఆయన తెలియజేశారు.

