కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష రాయటానికి ఎస్.ఎస్.ఎన్ ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చిన మహిళా అభ్యర్థినికి 6 నెలల బేబీ ఉంది. ఆ బేబీని ఆమె యొక్క భర్త వద్ద వదిలి పరీక్ష రాయటానికి లోపలి వెళ్ళింది. కొద్దిసేపటికి ఆ బేబీ ఏడుపు కేకలు అధికం కాగా, సదరు వ్యక్తి ఏమీ చేయలేని పరిస్థితిలో డయల్ 112 కు కాల్ చేసి సమాచారం అందించారు. ఆ సమాచారం అందుకున్న కంట్రోల్ రూమ్ పోలీస్ అధికారులు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఆదేశాల మేరకు ఆ పరీక్ష కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన SN పాడు ఎస్సై బి.శ్రీకాంత్ మరియు మహిళా హెడ్ కానిస్టేబుల్ పరమేశ్వరి బేబీని దగ్గర తీసికొని పాలు అందించారు.
మాతృ హృదయాన్ని చాటిన మహిళా హెడ్ కానిస్టేబుల్
22
Jan