తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని శంకరాపురం గ్రామంలో మండల టిడిపి పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల మధ్య పాదయాత్ర చేయాలని సంకల్పంతో శ్రీకారం చుట్టిన లోకేష్ కు అనుమతుల పేరుతో అడ్డంకులు సృష్టించడం హేయ మైనా చర్య అని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన పాదయాత్ర చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు. గ్రామ సర్పంచ్ కూరపాటి మహేశ్వరి నారాయణస్వామి. జిల్లా టిఎన్టియుసి అధ్యక్షులు మాజీ జెడ్పిటిసి కొక్కెర నాగరాజు. మాజీ జెడ్పిటిసి వరగాని పౌలు. పసుపు గళ్ళు మాజీ సర్పంచి ఇందూరి పిచ్చిరెడ్డి. శంకరాపురం గ్రామ టిడిపి అధ్యక్షులు మేడికొండ శివశంకరరావు. నూజిలపల్లి గ్రామ టిడిపి పార్టీ అధ్యక్షులు రామ లక్ష్మయ్య పులిపాడు వెంకటేశ్వర రెడ్డి. నందగోపాల్. పేరం ఆంజనేయులు. మేడికొండ హనుమంతరావు. వట్టి కొండ కోటేశ్వరరావు. గమిడి హనుమంతరావు. తదితరులు పాల్గొన్నారు.
ముండ్లమూరు లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
23
Jan