రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి పేద కుటుంబాలకు లబ్ధి చేకూరిందని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. మండలములోని పసుపుగల్లు గ్రామంలో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఆ గ్రామ సర్పంచ్ వరగాని బాల సుందర రావు. ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి. జడ్పిటిసి తాతపూడి మోజెస్ రత్నం రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీనవర్గాల సంక్షేమ మే లక్ష్యంగా అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు . ప్రతి పేదవానికి ఇల్లు. వైయస్సార్ ఆసరా. వైయస్సార్ చేయూత. అమ్మ ఒడి. పింఛన్లు. వైయస్సార్ రైతు భరోసా లాంటి పథకాలు ద్వారా రెండు లక్షల నుండి మూడు లక్షల వరకు లబ్ధి చేకూరిందన్నారు .దీంతో ప్రతి ఇంట జగనన్న సంక్షేమ పథకాలతో నవరత్నాల తో లబ్ధి పొంది వారి జీవితాలలో వెలుగులు నిండాయన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నవ్యాంధ్రలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా నవరత్న పథకాలతో సుభిక్షమైన పరిపాలన చేస్తున్నారన్నారు . సంక్షేమ పథకాలు కరోనా కష్టకాలంలోనూ అమలుపరిచి లబ్ధిదారులు అందరికీ అందేలా చేశారన్నారు. ఇంటింటికి వెళ్లి ఆయా కుటుంబాల వారిని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు గోపాల్ ను మీరు మీ ప్రభుత్వం పది కాలాలపాటు వర్ధిల్లాలంటూ వృద్ధులు మహిళలు ఆశీర్వదించారు జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలంటూ వృద్ధులు మహిళలు అన్నారు. ముందుగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కు ఎస్సీ కాలనీవాసులు పూలు చల్లుకుంటూ ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ యువ నాయకులు బిజ్జం వెంకటసుబ్బారెడ్డి. దర్శి ఏఎంసీ చైర్మన్ ఏనుముల వెంకటసుబ్బయ్య. మండల సచివాలయ కోఆర్డినేటర్ మేడికొండ జయంతి. ముళ్ళమూరు సొసైటీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర రెడ్డి. గోపనబోయిన పిలుపు రాజు. ఎంపీటీసీ దాసరి పెద్ద అంజయ్య. గర్నపూడి ప్రసన్నకుమార్. బద్రి సుబ్బారెడ్డి. ఎంపీటీసీ తేలుకుట్ల బ్రహ్మం. సర్పంచులు వేముల పద్మావతి శ్రీనివాసరావు. వంగల శ్రీనివాసరెడ్డి. జనమాల నాగేంద్ర పిచ్చయ్య. కందిమల్ల గీతాంజలి. చొప్పరపు వెంకటేశ్వర్లు. జమ్ముల గురవయ్య. మాజీ సర్పంచ్ దాసరి ఏలియా చింతా వెంకట శ్రీనివాసరెడ్డి. దుగ్గినేని వెంకట్. తదితరులు పాల్గొన్నారు.


