మండల సచివాలయ కన్వీనర్లు, సచివాలయ కన్వినర్లు బాధ్యతగా పనిచేసి ప్రజలలో పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. నూతనంగా ఎంపికయిన jcs తాళ్ళూరు మండల సచివాయ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి, గ్రామ కన్వినర్లు ఎమ్మెల్యేను కలసి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రెడ్డి, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఎం.ఎన్. పి నాగార్జున రెడ్డి, సొసైటీ చైర్మన్ శనివారపు శ్రీనివాస రెడ్డిలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచిలు వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచి కాశిరెడ్డి, మాజీ సర్పంచి టీవిసుబ్బారెడ్డి, వికాస్ తదితరులు పాల్గొన్నారు.
మండల సచివాలయ కన్వీనర్ల నియామకంతో ప్రజలకు మరిన్ని సేవలు – ఎమ్మెల్యేను కలసి సత్కరించిన మండల సచివాలయ కన్వినర్, సచివాలయ కన్విర్లు
